చైనాకు చెందిన సినోవాక్ టీకాను అత్యవసర వినియోగం కోసం ఆ దేశంలోని ఓ పట్టణంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ టీకా రెండు డోసుల ధర 60 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4,399. ఈ విషయాన్ని జియాషిన్ నగరంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వుయ్‌చాట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒక్కో వయల్ 29.75 డాలర్లకు విక్రయిస్తున్నారు. మొత్తం రెండు డోసులు తీసుకోవాలి. హైరిస్క్ గ్రూప్‌లోని వైద్యులు, సిబ్బందికి దీనిని ఇస్తున్నారు.
ఆ కరోనా వ్యాక్సిన్ ధర రూ.4,399..!
ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వేళ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన సినోవాక్ టీకాను అత్వవసర వినియోగం కోసం ఓ పట్టణంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల ధరను 60 డాలర్లుగా నిర్ణయించింది.
కరోనా కట్టడి కోసం జులై నుంచే అత్యవసర టీకా వినియోగాన్ని ప్రారంభించింది చైనా. ఈ టీకా ధరను ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం వుయ్‌చాట్‌లో విడుదల చేసిన ధరలో కూడా సబ్సిడీలు కలిసి ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టతలేదు. దీనిపై ఆ పట్టణ సీడీసీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. టీకా తయారీ సంస్థ సినోవాక్ కూడా ధరపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇటీవల ఇండోనేషియాకు చెందిన బయోఫార్మా కంపెనీ 40 మిలియన్ డోసుల కోసం సినోవాక్‌ను సంప్రదించింది. ఆ సమయంలో ఇండోనేషియా సంస్థ కొన్ని వివరాలను వెల్లడించింది. తమ దేశంలో ఆ టీకా అందుబాటులోకి వచ్చేసరికి ఒక్కో వయల్ 13.60 డాలర్లు పడుతుందని పేర్కొంది.
- ఇదీ చూడండి:'మహిళల వివాహ కనీస వయసుపై త్వరలోనే నిర్ణయం'