ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై పోరుకు టీకా అందేదెప్పుడు? - countries volunteers test first vaccine

కరోనాకు టీకాను కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోని మోడెర్నా సంస్థ తన టీకాను ప్రయోగాత్మకంగా మానవులపై పరీక్షించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మానవ చరిత్రలోనే టీకాలపై అత్యంత వేగంగా సాగించిన పరిశోధన ఇదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. 18-55 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 45 మంది వాలంటీర్లపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడానికి ఏడాదిన్నర కాలం పడుతుంది.

Coronavirus: US volunteers test first vaccine
కరోనా టీకా ఎందాకా?
author img

By

Published : Mar 18, 2020, 8:18 AM IST

కరోనాకు టీకాను సిద్ధం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జోరందుకున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ మందును రూపొందించి, క్లినికల్‌ పరీక్షలకు సిద్ధమయ్యాయి. ఇందులో అమెరికాలోని మోడెర్నా సంస్థ తన టీకాను ప్రయోగాత్మకంగా మానవులపై పరీక్షించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌, నార్వే, అమెరికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందింది. 2017లో భారత్‌, నార్వే ప్రభుత్వాలు, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌, ద వెల్కమ్‌ ట్రస్ట్‌, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో కొలీషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సెపి) అనే సంస్థను ఏర్పాటు చేశారు. 12 మంది ఓటుహక్కు ఉన్న సభ్యుల్లో భారత్‌ నుంచి గంగాదీప్‌ కంగ్‌ (వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల), రాజీవ్‌ వెంకయ్య (టకేద ఫార్మాస్యూటికల్‌ కంపెనీ లిమిటెడ్‌) సభ్యులు.

కరోనా ముప్పును గుర్తించిన వెంటనే సెపి సభ్యులు సమావేశమై టీకాపై పరిశోధన చేసేందుకు 200 కోట్ల డాలర్లను సేకరించాలని నిర్ణయించారు. ఈమేరకు శాస్త్రవేత్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. వారు కనుగొన్న టీకా జంతువులపై విజయవంతంగా పనిచేసింది. ప్రాథమికంగా ఈ మందుకు ఎంఆర్‌ఎన్‌ఏ-1273 అని పేరు పెట్టారు. మానవ చరిత్రలోనే టీకాలపై అత్యంత వేగంగా సాగించిన పరిశోధన ఇది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. 18-55 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 45 మంది వాలంటీర్లపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడానికి ఏడాదిన్నర కాలం పడుతుంది.

రష్యాలోనూ..

కరోనాకు తాము టీకాను కనుగొన్నామని, జంతువులపై నమూనా ప్రయోగాలు ప్రారంభించినట్లు రష్యా అధికారులు తెలిపారు. వీటి ఫలితాలు జూన్‌ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాకు చెందిన ఫైజర్‌, జర్మనీకి చెందిన బయోనెటెక్‌లు సైతం కరోనాకు టీకాను కనుగొనడానికి చేతులు కలిపాయి.

ప్రభావం చూపుతున్న చైనా మందు

కరోనాపై గెలిచేందుకు తాము వాడుతున్న ఫావిపిరావిర్‌ మందు సత్ఫలితాలు ఇస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. జపాన్‌లో 2014లో ప్రయోగ పరీక్షలకు అనుమతి పొందిన ఈ మందును తాము వాడామన్నారు. ఫలితంగా రోగులు వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details