కరోనా మహమ్మారికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు వరకు ప్రపంచ వ్యాప్తంగా 32,139 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం కేసుల సంఖ్య 6,83,525కు చేరగా.. వీరిలో 1,46,396 మంది కోలుకున్నట్లు వెల్లడించారు.
స్పెయిన్‌లో...
కరోనా వైరస్ స్పెయిన్‌లో మరణ మృందగం మోగిస్తోంది. వైరస్ ప్రభావంతో దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో మృతువాత పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 838 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు స్పెయిన్‌లో మహమ్మారి ధాటికి 6,528 మంది మృతి చెందారు.
దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 9.1 శాతం కేసులు పెరిగినట్లు వెల్లడించారు అధికారులు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 78,797కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోయిన దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో నిలవగా స్పెయిన్ రెండో స్థానంలో నిలిచింది.
ఇరాన్‌లోనూ...
కరోనా ధాటికి ఇరాన్లో ఇవాళ 123 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 2,640కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,901 మంది మందికి మహమ్మారి సోకినట్లు వెల్లడించారు. మొత్తం 38,309 మంది వైరస్ బారిన పడగా, అందులో 12,391 మంది కోలుకున్నట్లు తెలిపారు. మరో 3,467 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అమెరికా...
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ న్యూయార్క్ నగరాన్ని నిర్బంధించేది లేదని మరోసారి స్పష్టం చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,23,781 మంది అమెరికన్ వాసులకు వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,229 మంది మరణించారు.
ఇటలీలో...
కరోనా ధాటికి ఇటలీలో ఇప్పటి వరకు 10,023 మంది మరణించారు. మొత్తం 92,472 మంది వైరస్ బారిన పడగా... అందులో 12,384 మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 32 వేలు ధాటిన కరోనా మృతులు ఇదీ చూడండి:కేరళలో కరోనా అనుమానితుడు మృతి