ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పలు దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీంతో ఆయా దేశాలు కొవిడ్ ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇదే సమయంలో మరోదఫా కొవిడ్ ఉద్ధృతితో పలు దేశాలు సతమతమవుతున్నాయి. తాజాగా రష్యాలో కరోనా వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. గతకొన్ని రోజులుగా నిత్యం 900మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం. వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా కొనసాగడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు పాటించకపోవడంతోనే రష్యాలో వైరస్ విజృంభణ ఒక్కసారిగా పెరగడానికి కారణాలని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.
రష్యాలో గత రెండురోజులుగా కొవిడ్ మరణాలు విపరీతంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 929 కొవిడ్ మరణాలు నమోదు చేసుకోగా.. వరుసగా రెండోరోజు 924 మంది మృత్యువాతపడినట్లు క్రెమ్లిన్ అధికారులు వెల్లడించారు. యూరప్‌లో అత్యధిక మరణాలు రష్యాలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ 2,13,000 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య 27వేల కేసులు నమోదు చేసుకోగా.. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మందకొడి వ్యాక్సినేషన్‌తోనే..