చైనాలో కరోనా వైరస్‌తో మృతి చెందేవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. మహమ్మారి బారినపడి సోమవారం 31 మంది మృతి చెందినట్లు ప్రకటించాయి ఆ దేశ ఆరోగ్య వర్గాలు. మొత్తం మృతుల సంఖ్య 2,943కు చేరినట్లు వెల్లడించాయి. తాజా మరణాలన్నీ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న హుబేలోనే నమోదయ్యాయి. కొత్తగా 125 మందికి వైరస్ సోకినట్లు తెలిపారు అధికారులు. ఇందులో 114 మంది హుబేకు చెందిన వారే.
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 89,527 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). మొత్తం 3,056 మంది మృత్యువాతపడినట్లు పేర్కొంది.