చైనాలో కరోనా వైరస్ బారిన పడుతున్న విదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో తాజాగా 31 కేసులు నమోదుకాగా.. అందులో 30మంది విదేశీయులే ఉన్నారు. దీని వల్ల వైరస్ సోకిన విదేశీయుల సంఖ్య 723కు చేరింది.
చైనాలో ఇప్పటివరకు మొత్తం 81,470 కేసులు నమోదయ్యాయి. వీరిలో 75వేల 770మంది వైరస్‌ను జయించారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరోవైపు మహమ్మారితో తాజాగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 3వేల 304కు చేరింది.
న్యూయార్క్...
అమెరికాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్ వైరస్ కేంద్రబిందువుగా మారింది. దేశం మొత్తంలో 2 వేల 485 మరణాలు సంభవించగా.. ఒక్క న్యూయార్క్‌లోనే వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 965 కేసులు నమోదయ్యాయి.
అయితే.. పరిస్థితులు ఇంకా తీవ్రమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 2 వారాల్లో కరోనా మరణాల రేటు మరితం తీవ్రమవుతుందనిఅంచనా వేశారు.