తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 73వేలు దాటిన కరోనా కేసులు - Coronavirus cases on cruise ship off Japan

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ ధాటికి ఇప్పటివరకు చైనాలో 1868 మంది మరణించారు. మరో 72,436 మందికి వైరస్​ లక్షణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయంగా 73 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు అధికారులు. దేశాలవారిగా ఎంతమంది కరోనా బారిన పడ్డారో పరిశీలిస్తే..

coronavirus-cases-top-500-on-cruise-ship-off-japan
ప్రపంచ వ్యాప్తంగా 73వేలు దాటిన కరోనా బాధితులు!

By

Published : Feb 18, 2020, 6:30 PM IST

Updated : Mar 1, 2020, 6:17 PM IST

కరోనా... ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్​ ధాటికి మానవులు పిట్టల్లా రాలిపోతున్నారు. విరుగుడు మందులేని కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఒక్క చైనాలోనే 1,868 మంది బలయ్యారు. మరో 72,436 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మాత్రం కేసులు 73 వేలు దాటాయి.

చైనాలోనే కాకుండా పలు దేశాల్లోనూ పదుల సంఖ్యలో కరోనా బాధితులున్నారు. చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్​లో 610 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు చైనాతో కలిపి 73 వేలు దాటాయి.

పలు దేశాల్లో నమోదైన కేసులు...

హాంకాంగ్ 58 (చనిపోయిన వ్యక్తితో కలిపి)
మకావు 10 (నౌకలోని 542 మందితో కలిపి)
యెకోహమా 1
జపాన్​ 610
సింగపూర్ 77
థాయిలాండ్ 35
దక్షిణ కొరియా 31
మలేసియా 22
తైవాన్ 22 (చనిపోయిన వ్యక్తితో కలిపి)
ఆస్ట్రేలియా 14
జర్మనీ 16
వియత్నాం 16
అమెరికా 15
ఫ్రాన్స్ 12 (చని పోయిన వ్యక్తితో కలిపి)
యూఏఈ 9
కెనడా 8
ఫిలిప్పీన్స్ 3 (చనిపోయిన వ్యక్తితో కలిపి)
యూకే 3
భారత్ 3
ఇటలీ 3
రష్యా 2
స్పెయిన్ 2
బెల్జియం 1
నేపాల్ 1
శ్రీలంక 1
స్వీడన్ 1
కాంబోడియా 1
ఫిన్​లాండ్​ 1
ఈజిప్ట్ 1


500 మందికి విముక్తి...

జపాన్‌ తీరంలోని విహారనౌక డైమండ్‌ ప్రిన్స్‌ నిర్బంధంలో ఉన్న 500 మంది ప్రయాణికులను బుధవారం పంపించనున్నట్లు ఆ దేశ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా వైరస్​ నెగటివ్​ వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Last Updated : Mar 1, 2020, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details