చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మిగతా దేశాల్లో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మంగళవారం ఒక్కరోజే ఇటలీలో 168 మంది కరోనాతో మృతి చెందడం.. వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది. తాజా మరణాలతో ఇటలీలో మృతుల సంఖ్య 631కు చేరుకుంది. ఇప్పటి వరకు 8,514మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
చైనాలో అదుపులోనే పరిస్థితి..
చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్‌తో మంగళవారం 22మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,158కు పెరిగింది. చైనాలో ఇప్పటివరకు 80,778 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం 16,145మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
కొరియాలో మళ్లీ...
కొద్ది రోజులుగా కేసులు తగ్గుతున్న దక్షిణ కొరియాలో 5 రోజులకు వైరస్ బాధితులు పెరిగారు. మంగళవారం అక్కడ కొత్తగా 242 మందికి కరోనా సోకినట్లు తెలిపారు అధికారులు. మొత్తం బాధితుల సంఖ్య 7,755కు చేరింది. మరో 6 మరణాలతో మృతుల సంఖ్య 60కి పెరిగింది.