పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు కరోనా సాకుతో స్వేచ్ఛను ప్రసాదించింది అక్కడి ప్రభుత్వం. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకుతుందని కారణం చూపుతూ అనేక మంది ముష్కరులను ఇళ్లకు పంపించివేసింది. వీరిలో ప్రమాదకర లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. లాహోర్ జైలులోని 50 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు గత నెలలో తెలిపారు పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
పాక్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి నుంచి తొలగించాలంటే ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) తేల్చి చెప్పిన నేపథ్యంలో గత కొన్ని నెలల్లో ఇనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ప్రపంచ దేశాలన్ని ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే ఇదే అదనుగా పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు విముక్తి కల్పించింది. ఇప్పుడు వారంతా యథేచ్ఛగా తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగిస్తున్నారు.