ప్రపంచవ్యాప్తంగా కోటి 25 లక్షలకు చేరువలో కేసులు - nepal corona nases
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 25 లక్షలకు చేరువవుతోంది. మరణాల సంఖ్య 5లక్షల 58వేలు దాటింది. పాకిస్థాన్లో వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య 2 లక్షల 43వేలు దాటింది. 5వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా కోటి 25 లక్షలకు చేరువైన కరోనా కేసులు
By
Published : Jul 10, 2020, 8:29 PM IST
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ అంతకంతకూ తీవ్రమవుతోంది. మొత్తం బాధితుల సంఖ్య కోటి 24 లక్షల 33 వేలు దాటింది. 5 లక్షల 58వేల 383 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 72 లక్షల 52 వేల 605 మంది కోలుకున్నారు.
పాకిస్థాన్లో 5వేలు దాటిన మరణాలు..
పాకిస్థాన్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా నమోదైన 2,751 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 43 వేల 599కి చేరింది. మరణాల సంఖ్య 5వేల 58కి పెరిగింది.
నేపాల్లో 118 కేసులు..
నేపాల్లో 24 గంటల్లో 118 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 16వేల 649కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 8వేల 603గా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాలు..