పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని పీఎం నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రత్యేక సలహాదారు ఫైజల్ సుల్తాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇమ్రాన్.. ప్రస్తుతం ఐసొలేషన్లో ఉన్నట్టు పేర్కొన్నారు.
కరోనా టీకా తొలి డోసు తీసుకున్న రెండు రోజులకు 67ఏళ్ల ఖాన్కు వైరస్ సోకిందని తేలడం గమనార్హం.