తెలంగాణ

telangana

ETV Bharat / international

కొలెస్ట్రాల్ వ్యవస్థ హైజాక్ ద్వారా కరోనా ఇన్ఫెక్షన్​! - corona virus latest news

కొలెస్ట్రాల్ జీవక్రియకు, కొవిడ్-19కు మధ్య సంబంధాన్ని చైనా పరిశోధకులు గుర్తించారు. మానవ శరీరంలోని హెచ్​డీఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ కలిగించే సమయంలో కరోనా వైరస్.. మానవుల్లోని ఏసీఈ2 అనే రిసెప్టార్​ను ఉపయోగించుకుంటుందని తెలిపారు.

COVID CHOLESTEROL
కరోనా కొలెస్ట్రాల్

By

Published : Nov 28, 2020, 8:01 AM IST

మానవుల్లోని అంతర్గత కొలెస్ట్రాల్ ప్రాసెసింగ్ వ్యవస్థను తెలివిగా ఉపయోగించుకోవడం ద్వారా శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కారం ఆధారంగా కరోనా మహమ్మారికి కొత్త చికిత్స మార్గాలను కనుగొనవచ్చని చెప్పారు. 'అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్' శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.

కొలెస్ట్రాల్ జీవక్రియకు, కొవిడ్-19కు మధ్య సంబంధాన్ని ఇది బయట పెట్టింది. మానవ శరీరంలో హెచ్​డీఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ కలిగించే సమయంలో కరోనా వైరస్.. మానవుల్లోని ఏసీఈ2 అనే రిసెప్టార్ ను ఉపయోగించుకుంటుంది.

'హెచ్డీఎల్ స్కావెంజర్ రిసెప్టార్ బి టైప్ 1' (ఎస్ఆర్-బీ1) అనే మరో రిసెప్టార్ పాత్రను చైనా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇది మానవుల ఊపిరితిత్తుల కణాలు సహా అనేక కణజాలాల్లో కనిపిస్తుంది. ఈ రిసెప్టార్.. హెడీఎల్ కొలెస్ట్రాల్​కు అతుక్కుంటుంది. ఈ రిసెప్టారకు సంధానం కావడం ద్వారా కరోనా వైరస్.. కొలెస్ట్రాల్​కు చేరుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం అక్కడి వ్యవస్థను హైజాక్ చేస్తోందన్నారు. తద్వారా శరీరంలో వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'పది నెలల్లోనే కరోనా టీకా సాధ్యమైందిలా'

ABOUT THE AUTHOR

...view details