తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2020, 7:57 PM IST

ETV Bharat / international

చికెన్‌ వింగ్స్‌లో కరోనా.. చైనాలో కలకలం!

చైనాలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జియాన్​, షెన్​జెన్​ నగరాల్లోకి దిగుమతి అయిన రొయ్యలు, చికెన్​ వింగ్స్​ ఉత్పత్తుల్లో కరోనా ఉన్నట్లు తేలడం వల్ల స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను ట్రాక్‌ చేసి పరీక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Corona in chicken wings
చికెన్‌ వింగ్స్‌లో కరోనా.. చైనాలో కలకలం!

చైనాలోని జియాన్‌, షెన్‌జెన్‌ నగరాల్లో కరోనా వైరస్‌ మరోసారి కలకలం రేపింది. ఈక్వెడార్‌ నుంచి దిగుమతైన రొయ్యలు, బ్రెజిల్‌ నుంచి వచ్చిన చికెన్‌ వింగ్స్‌ ఉత్పత్తుల్లో కరోనా ఉన్నట్టు తేలడం వల్ల స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దిగుమతి చేసుకున్న నిల్వ ఆహారపదార్థాల కొనుగోలు విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించాయి.

రొయ్యల పార్శిల్స్​లో..

చైనాలోని షాంజీ ప్రావెన్స్‌లోని జియాన్‌ నగరానికి ఇటీవల ఈక్వెడార్‌ నుంచి రొయ్యలు దిగుమతయ్యాయి. అయితే, కరోనా నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను పరీక్షిస్తుండగా కొన్ని రొయ్యల పార్శిల్స్‌లో వ్యాధికారక వైరస్‌ ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా ఉత్పత్తులు, వాటితో ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలిందని తెలిపారు.

చికెన్​ వింగ్స్​లో..

గ్వాంగ్డాంగ్‌ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌ నగరానికి బ్రెజిల్‌ నుంచి దిగుమతైన చికెన్‌ వింగ్స్‌లోనూ కరోనా వైరస్‌ ఉండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ కలుషితాహారంతో మళ్లీ వైరస్‌ ఎక్కడ విజృంభిస్తోందోనని ఆందోళనగా ఉందని అధికారులు తెలిపారు. చికెన్‌ వింగ్స్‌ ఉపరితలం నుంచి తీసుకున్న నమూనాలను పరీక్షించగా కరోనా ఉన్నట్టు గుర్తించినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలోని అరోరా ఎలిమెంటోస్‌ ప్లాంట్‌ నుంచి ఈ మాంసం షెన్‌జెన్‌కు వచ్చినట్టు వివరించారు.

దిగుమతి చేసుకున్న ఆహారోత్పత్తులను ట్రాక్‌ చేసి పరీక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం ఏ పరిస్థితుల్లో కలుషితమయిందో చెప్పడం కష్టమేనని చైనాకు చెందిన ఓ మాంసం వ్యాపారి తెలిపాడు.

ఇదీ చూడండి: తమిళనాడులో మరో 5,835 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details