ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా ఇతర దేశాల్లో ఈ మహమ్మారి కారణంగా వేలాది మంది మృత్యువాతపడగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,01,483కు చేరుకుంది. 16.75లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో అత్యధికం
వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికాలో అత్యధికంగా 4.88లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 20,414 మందికి పైగా వైరస్ సోకగా.. 1,318 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం మృతుల సంఖ్య 18,009కి చేరింది.