తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రష్యాలో ఒక్కరోజులో 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అక్కడ కేసుల సంఖ్య 87,147కు చేరింది. స్పెయిన్​లో 24 గంటల్లో 331 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలో ఇప్పటివరకు లక్షా 24 వేల మందికి పైగా మరణించగా, 13,79,443 మందికి వైరస్ సోకింది.

Corona claw over the world: Cases exceeding thirty lakhs
ప్రపంచంపై కరోనా పంజా: ముప్ఫై లక్షలు దాటిన కేసులు

By

Published : Apr 27, 2020, 9:00 PM IST

ప్రపంచంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 22వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1039మంది ప్రాణాలు కోల్పోయారు. 57వేల 5వందల మంది పరిస్థితి విషమంగా ఉంది.

దేశాల వారిగా కేసులు

అమెరికాలో..

వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అమెరికాలో కొత్తగా 1772 మంది మహమ్మారి బారినపడ్డారు. 8 లక్షల 14వేల యాక్టివ్ కేసులున్నాయి. 15వేలమంది పరిస్థితి విషమంగా ఉంది. న్యూయార్క్ నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

స్పెయిన్​లో ఒక్కరోజే 331 మరణాలు..

స్పెయిన్​లో కరోనా మరణాలు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 331 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అక్కడ మొత్తం మృతుల సంఖ్య 23,500కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 2 లక్షల 19 వేలకు పైగా మహమ్మారి బారినపడ్డారు.

సింగపూర్​లో 14 వేలమందికి..

సింగపూర్​లో సోమవారం మరో 799 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 14,423 కేసులు నమోదయ్యాయి. మొత్తం 12 మంది మృతి చెందారు.

పాక్​లో 281 మంది మృతి...

పొరుగు దేశమైన పాక్​లో తాజాగా మరో 12 మంది మరణించారు. మొత్తంగా 281 మంది వైరస్ కారణంగా అసువులు బాశారు. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 13,328కు పెరిగింది.

థాయ్​లాండ్​లో ఆరువారాల కనిష్ఠానికి..

థాయ్​లాండ్​లో నూతనంగా 9 కేసులు మాత్రమే నమోదైనట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. ఆరు వారాల్లో నమోదైన వైరస్​ కేసుల్లో ఇదే అత్యల్పమని వెల్లడించారు. అక్కడ మొత్తంగా 2,931 మందికి వైరస్​ సోకగా.. 52 మంది కరోనా కారణంగా మరణించారు.

రష్యాలో పెరుగుతున్న కేసులు..

రష్యాలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 6 వేలమందికి వైరస్​ సోకింది. 47 మంది కన్నుమూశారు. మొత్తంగా బాధితుల సంఖ్య 87,147 మందికి చేరింది. 794 మంది ఇప్పటివరకు మృతి చెందారు. రష్యా సైన్యంలో 874 మందికి వైరస్​ సోకింది.

ఇరాన్​లో..

ఇరాన్​లో నేడు మరో 991 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 96 మంది మరణించారు. దేశంలో 91,472 మందికి కొవిడ్-19 సోకగా.. 5,806 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశాల వారీగా...

బెల్జియంలో వైరస్ కేసుల సంఖ్య 46,687కు పెరిగింది. 7,207 మంది మృతి చెందారు. నెదర్లాండ్స్​లో 24 గంటల్లో 400 మందికి పాజిటివ్​గా తేలగా మొత్తం కేసుల సంఖ్య 38,345కు చేరింది. జర్మనీలో కరోనా కేసులు లక్షా 58వేలకు చేరువయ్యాయి. బ్రెజిల్​లో 63,328 మందికి వైరస్ బాధితుల సంఖ్య చేరింది.

ABOUT THE AUTHOR

...view details