ప్రపంచవ్యాప్తంగా 90లక్షలకు చేరువలో కరోనా కేసులు - cororna us updates
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 90లక్షలకు చేరువవుతోంది. ఇప్పటివరకు 4లక్షల 66వేల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. ఇటలీలో కొత్తగా 262మందికి వైరస్ సోకింది. మరో 49మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా 90లక్షలకు చేరువైన కరోనా కేసులు
By
Published : Jun 21, 2020, 10:25 AM IST
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 89 లక్షల 15వేల 891కి చేరింది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 4లక్షల 66వేల 728కి పెరిగింది. 47లక్షల 38వేల 623 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 23లక్షల 30వేల 578 మందికి వ్యాధి సోకింది. 10లక్షల 70వేల 139 మంది బాధితులతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది.
ఇటలీలో 4 నెలలుగా..
కరోనా కారణంగా అతలాకుతలమైన పర్యాటక ప్రసిద్ధ దేశం ఇటలీలో వైరస్ వ్యాప్తి మొదలై నాలుగు నెలలు పూర్తయింది. ఆ దేశంలో కొత్తగా 262 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 49మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 38వేల 275కి చేరింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 34వేల 610కి పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..