కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 56లక్షల 89వేల 212కు చేరింది. ఇప్పటి వరకు 3లక్షల 52వేల 294 మంది ప్రాణాలు కోల్పోయారు. 24లక్షల 32 వేల 271 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 17లక్షల 25వేలు దాటగా, లక్ష మందికి పైగా చనిపోయారు.
చైనాలో కొత్తకేసులు..
చైనాలో కొత్తగా 28మందికి కరోనా సోకింది. వీరిలో వైరస్ లక్షణాలేమీ కనపించక పోవడం ఆ దేశాన్ని కలవరానికి గురి చేస్తోంది. కొత్త కేసుల్లో ఎక్కువగా వైరస్ కేంద్ర బిందువైన వుహాన్ నుంచే నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ తరహా కేసులు రాష్ట్రంలో ఇప్పటి వరకు 332 నమోదయ్యాయి.
దక్షిణ కొరియాలో 40 కేసులు..
కరోనా ప్రభావం తగ్గిందని భావిస్తున్న దక్షిణ కొరియాలో ఒక్క రోజే 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.
పాక్లో 1446 కొత్త కేసులు
పాకిస్థాన్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 24 గంటల్లో 1,446 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 59వేలు దాటింది. మృతుల సంఖ్య 1,225కు పెరిగింది.