ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం కొనసాగుతుంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల 51లక్షల 61వేల 134కి పెరిగింది. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8లక్షల 46వేల 734కి చేరింది . వ్యాధి బారినపడిన వారిలో కోటి 75లక్షల 6వేల 54 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 68లక్షల 10వేల 346 యాక్టివ్ కేసులున్నాయి.
వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న అమెరికా, భారత్, బ్రెజిల్లో అధిక సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అగ్రరాజ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 61 లక్షలు దాటగా.. లక్షా 86వేల మందికిపైగా వైరస్‌కు బలయ్యారు. బ్రెజిల్లో కేసుల సంఖ్య 38లక్షల 46వేలు దాటింది. ఇప్పటివరకు లక్ష 20వేల మందికిపైగా మరణించారు.