అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు 29 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హమ్జా ఆచూకీ తెలిపిన వారికి అమెరికా రివార్డు ప్రకటించిన మరుసటి రోజే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అతడ్ని బ్లాక్‌లిస్టులో పెట్టింది. అల్‌ఖైదా ప్రస్తుత నాయకుడు అల్ జవహరీకి వారసుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
అల్‌ఖైదాలో హమ్జా అధికారిక సభ్యుడని, అనుచరులకు ఉగ్రదాడులు చేయాలని పిలుపునిచ్చినట్లు భద్రతా మండలి ఒక ప్రకటనలో తెలిపింది.
బ్లాక్ లిస్టులో ఉంచటం వల్ల ప్రయాణం, ఆస్తుల లావాదేవీలు, ఆయుధాల కొనుగోలు లాంటి వాటిపై నిషేధం అమల్లోకి వచ్చింది.