అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మిస్తున్న నూతన గ్రామంపై వచ్చిన వార్తలపై చైనా స్పందించింది. తమ భూభాగంలో అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలు జరగడం సర్వసాధారణం అంటూ చైనా విదేశాంగ మంత్రి హువా చునైంగ్ చెప్పుకొచ్చారు.
'జాంగ్నాన్ ప్రాంతంపై (దక్షిణ టిబెట్) చైనాకు స్పష్టత ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ను ఎప్పుడూ గుర్తించం. చైనా తన సొంత భూభాగంలో అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలను నిరంతరం చేపడుతుంది. ఇది మా భూభాగంలోనే ఉంది. అందుకే ఆరోపణలకు తావులేదు' అని చునైంగ్ పేర్కొన్నారు.
భారత్ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్.. దక్షిణ టిబెట్‌లో భాగమంటూ చైనా వాదిస్తుంది. అభివృద్ధి పనుల పేరిట సరిహద్దుల్లో కొన్ని నిర్మాణాలు చేపడుతోంది.