తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ వినతి పత్రం - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మండల విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.

Mahabubabad
Mahabubabad

By

Published : Jun 11, 2020, 7:30 PM IST

కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల విద్యుత్ శాఖ అధికారి లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు.

లాక్ డౌన్ తో ఉపాధి అవకాశాలు లేక ఇక్కట్లు పడుతున్న క్రమంలో 3 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజల విద్యుత్ బిల్లులను రద్దు చేసి, 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details