తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా: 811మందిని బలిగొన్న రాకాసి వైరస్​ - సార్స్​ వైరస్ మృతుల సంఖ్య

చైనాలో కరోనా వైరస్​ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 811మంది బలయ్యారు. మరో 37 వేల మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​ తెలిపింది.

coronavirus
కరోనా వైరస్

By

Published : Feb 9, 2020, 6:09 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

చైనాలో కలకలం రేపుతోన్న కరోనా వైరస్​ కారణంగా ఇప్పటివరకు 811మంది మరణించారు. మరో 37 వేల మంది వైరస్​ బారిన పడినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది.

ఒక్క శనివారం నాడే.. 89 మరణాలు సంభవించాయి. 2,656 కేసులు నమోదయ్యాయి. మృతుల్లో 81 మంది హుబే రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

మరోవైపు వైరస్​ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు నెమ్మదిగా కోలుకుంటున్నారు. శనివారం 600 మంది ఆసుపత్రి నుంచి డిస్చార్జ్​ అయ్యారు. వారిలో 324 మంది హుబే రాష్ట్రానికి చెందినవారున్నారు.

ఇదీ చదవండి: సైకోలా మారిన సైనికుడు-20 మంది బలి

Last Updated : Feb 29, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details