తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో వినోదాల విందు- డిస్నీల్యాండ్​ రీఓపెన్ - corona virus news

ఓ వైపు కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ.. వ్యాపార సముదాయాలు, వినోద​ కేంద్రాలు, పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తోంది చైనా. ఈ క్రమంలో సోమవారం షాంఘైలోని డిస్నీల్యాండ్​ థీమ్​ పార్క్​ను తెరిచింది. వైరస్​ వ్యాప్తి చెందకుండా పలు ఆంక్షలతో 30 శాతం మంది సందర్శకులకు మాత్రమే అనుమతులు ఇచ్చింది.

Shanghai Disneyland reopens,
చైనాలో తెరుచుకున్న షాంఘై డిస్నీల్యాండ్​ థీమ్​ పార్క్​

By

Published : May 11, 2020, 11:07 AM IST

Updated : May 11, 2020, 11:30 AM IST

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశంలోని పలు వినోద​ కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తోంది చైనా. అందులో భాగంగా షాంఘైలోని ప్రముఖ డిస్నీల్యాండ్​ థీమ్​ పార్క్​ను సోమవారం తిరిగి ప్రారంభించింది. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు ఆంక్షలతో సందర్శకులకు అనుమతించింది.

చైనాలో వినోదాల విందు- డిస్నీల్యాండ్​ రీఓపెన్

కొవిడ్​-19 వ్యాప్తి తర్వాత జనవరి చివరి వారంలో డిస్నీ రిసార్ట్​ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుతున్నందున.. టికెట్​ అమ్మకాలను 30 శాతానికి పరిమితం చేసి ప్రారంభించారు.

పెరుగుతున్న కొత్త కేసులు

చైనాలో ఆదివారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ ప్రకటించింది. వైరస్​కు కేంద్ర బిందువైన వుహాన్​ నగరంలో 5, జిలిన్​ రాష్ట్రంలో 3, లియోనింగ్​ రాష్ట్రంలో ఒకటి, హీలోంగ్​జియాంగ్​ రాష్ట్రంలో ఒక కేసు నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కేసుల్లో 12 లక్షణాలు కనబడనివే ఉన్నాయని.. ఇలాంటి కేసులు మొత్తం 780కి చేరినట్లు వెల్లడించింది.

ఆత్మ సంతృప్తి వద్దు..

కొవిడ్​-19 మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయటంలో సఫలమైనట్లు సంకేతాలిస్తూ.. కొద్ది రోజుల క్రితం వైరస్​ సోకే ప్రమాద స్థాయిలను కనిష్ఠానికి తగ్గించింది చైనా. ప్రభుత్వ మార్గదర్శకాలతో.. వ్యాపారాలు, పరిశ్రమలు ఉత్పత్తి మొదలుపెట్టాయి. కరోనాను కట్టడి చేయగలిగామనే ఆత్మసంతృప్తి చెందకుండా.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది జిన్​పింగ్​ ప్రభుత్వం.

చైనాలో మొత్తం కేసుల సంఖ్య 82, 918కి చేరింది. 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 141 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Last Updated : May 11, 2020, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details