హాంకాంగ్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. చైనా నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ వేల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్డెక్కారు. వారిని నియంత్రించేందుకు బలగాలు యత్నించడం వల్ల పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఘర్షణలతో మరోసారి అట్టుడికిన హాంకాంగ్ - చైనా నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళన
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధమైన వేళ హాంకాంగ్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. చైనా నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది నిరసనకారులు రోడ్డెక్కారు. బలగాలు చెదరగొట్టేందుకు ప్రయత్నించడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఘర్షణలతో మరోసారి అట్టుడికిన హాంకాంగ్
ఘర్షణలతో మరోసారి అట్టుడికిన హాంకాంగ్
ఆందోళనకారులపైకి పోలీసులు బాష్పవాయువు గోళాలు, రబ్బరు తూటాలు, జల ఫిరంగులను ప్రయోగించారు. కొన్నిచోట్ల నిరసకారులు.. పోలీసులపైకి రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. మరోవైపు హాంకాంగ్ నిరసనకారులకు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ, తైవాన్ రాజధాని తైపీలో వేలమంది ర్యాలీలు నిర్వహించారు.
Last Updated : Oct 2, 2019, 1:13 PM IST