హాంకాంగ్‌లో నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులు చేస్తున్న నిరసనల్లో హింస తాండవిస్తోంది.
హింసకు కేంద్రంగా హాంకాంగ్ విశ్వవిద్యాలయం - hong kong protests pics
హాంకాంగ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలతో నగరం అంతటా హింసాయుత పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా స్థానిక విశ్వవిద్యాలయంలో నిరసనకారులు తలదాచుకుంటున్నారు. లోపలికి రాకుండా పోలీసులను నిలువరించడానికి పెట్రోల్ బాంబులు, బాణాలు ఉపయోగిస్తున్నారు.
హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో తలదాచుకుంటున్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి బాష్పవాయు గోళాలు, జలఫిరంగులు ప్రయోగించారు. కొద్దిరోజులుగా విశ్వవిద్యాలయంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉంటున్న నిరసనకారులు... పోలీసులను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. పెట్రోల్ బాంబులు, బాణాలతో భద్రతా దళాలపై దాడి చేస్తున్నారు. ప్రతి దాడిలో ఓ ఆందోళనకారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
లోపల ఉన్న కొంతమంది నిరసనకారులను పోలీసులు బయటకు తీసుకురాగలిగారు. యూనివర్శిటీ చుట్టూ భారీ వలలను ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.