తెలంగాణ

telangana

ETV Bharat / international

తైవాన్​ గగనతలంలోకి భారీగా చైనా యుద్ధ విమానాలు!

మునుపెన్నడూ లేని స్థాయిలో చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి చొచ్చుకు వస్తున్నాయని తైవాన్‌(Chinese Planes Taiwan) ఆరోపించింది. శనివారం కూడా 30కిపైగా విమానాలు చక్కర్లు కొట్టాయని చెప్పింది.

china planes on taiwan
తైవాన్​పై చైనా విమానాలు

By

Published : Oct 3, 2021, 12:47 PM IST

తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల చొరబాటు(Chinese Planes Taiwan) ఆగడం లేదు. వరుసగా రెండో రోజు.. శనివారం 30కి పైగా విమానాలు తమ ఎయిర్​జోన్​లోకి చొచ్చుకువచ్చాయని తైవాన్​ ఆరోపించింది. శనివారం పగలు, రాత్రి వేళలో 39 విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని(Chinese Planes Taiwan) తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు శుక్రవారం కూడా ఇదే తరహాలో 38 విమానాలు ప్రవేశించాయని చెప్పింది.

అన్నీ యుద్ధ విమానాలే..

శనివారం పగటిపూట 20 విమానాలు ప్రవేశించగా.. రాత్రివేళ మరో 19 విమానాలు చొచ్చుకువచ్చాయని తైవాన్​ సెంట్రల్ ​న్యూస్​ ఏజెన్సీ తెలిపింది. ఈ విమానాల్లో చాలావరకు జే-17, ఎస్​యూ-30 యుద్ధ విమానాలేనని పేర్కొంది. చైనా యుద్ధవిమానాలు ఈ స్థాయిలో చొచ్చుకురావడం మునుపెన్నడూ జరగలేదని చెప్పింది.

అనాగరిక చర్యతో..

"చైనా ఎల్లప్పుడూ దారుణమైన, అనాగరికమైన చర్యలకు పాల్పడుతూ, ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తోందని" తైవాన్​ ప్రధాని సు సెంగ్-చాంగ్​ ఆరోపించారు. దక్షిణ తైవాన్​లో ఓ సైన్స్​పార్క్​ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనిపై చైనా ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఇదీ చూడండి:మారిషస్‌లో భారత నౌకాదళ స్థావరం?

ABOUT THE AUTHOR

...view details