అంగారకుని పైకి చైనా ప్రయోగించిన తియాన్వెన్-1 వ్యోమనౌక బుధవారం ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొన్ని నెలల తరువాత వ్యోమనౌకలోని ఆర్బిటర్ నుంచి రోవర్ విడిపోయి కిందికి దిగుతుంది. అంగారక గ్రహంలో భూగర్భ జలాలు ఉన్నాయా? ప్రాచీన నాగరికత ఏమైనా ఉందా? అనే విషయాలపై అధ్యయనం చేస్తుంది. ఏడు నెలల పాటు ప్రయాణించి కక్ష్యలోకి చేరుకుంది.
అంగారకుని కక్ష్యలో చైనా వ్యోమనౌక
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా అంగారకునిపై చైనా పంపిన వ్యోమనౌక కక్ష్యలోకి ప్రవేశించింది. ఏడు నెలల పాటు ప్రయాణించిన ఈ వ్యోమనౌక.. అంగారక గ్రహంలో భూగర్భ జలాలు, ప్రాచీన నాగరికత అవశేషాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై అధ్యయనం చేస్తుంది.
అంగారకుని కక్ష్యలో చైనా వ్యోమనౌక
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయోగించిన మరో వ్యోమనౌక 'అమల్' మంగళవారమే కక్ష్యలోకి ప్రవేశించింది. అమెరికా ప్రయోగించిన పెర్సర్వన్స్ వ్యోమనౌకలోని రోవర్ వచ్చే వారం అంగారకుని భూతలంపై దిగనుంది. ఈ మూడింటిని గత ఏడాది జూలైలో ప్రయోగించడం గమనార్హం. ఇప్పటికే ఆరో వ్యోమనౌకలు అంగారకుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో మూడు అమెరికావి, రెండు ఐరోపావి, ఒకటి భారత దేశానికి చెందినది.