చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై మట్టి, రాళ్లను విజయవంతంగా సేకరించగా... ఈ నెల మధ్య నాటికి భూమిని చేరుకోనున్నట్లు ఆ దేశ జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం తెలిపింది. నమూనాలను వ్యోమనౌకలో భద్రపరిచి.. భూమికి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. గతంలో నేలకు తీసువచ్చిన రాళ్ల కంటే బిలియన్ల సంవత్సరాల చిన్నవి కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.
తిరిగి వచ్చే వాహనంతో చంద్రకక్ష్యలో నిరిష్ట స్థలానికి చేరి.. ఆపై నమూనాలను క్యాప్సూల్‌కు బదిలీ చేస్తుందని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత ఈ నెల మధ్యనాటికి ఆ వ్యోమనౌక భూమిని చేరనున్నట్లు సమాచారం. ఆ మట్టి, రాళ్లు కలుషితం కాకుండా ఓ ప్రత్యేక డబ్బాలో ఉంచినట్లు పేర్కొన్నారు.