తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలోనే వేగవంతమైన కంప్యూటర్​- 'జియూఝాంగ్'​ - చైనా కంప్యూటర్​ తాజా

ప్రపంచంలోనే అత్యంత తేలికైన క్వాంటమ్​ కంప్యూటర్​ను చైనా శాస్త్రవేత్తలు తయారు చేశారు. సంప్రదాయ సూపర్​ కంప్యూటర్ వేల సంవత్సరాలు చేసే పనిని కేవలం సెకండ్స్​లోనే చేయగలదని తెలిపారు. ఇది 'అతిపెద్ద విజయం'గా అభివర్ణించారు.

Chinese scientists make world's first light-based quantum computer: Report
'జియూ జాంగ్'​-ప్రపంచంలోనే తేలికైన కంప్యూటర్​

By

Published : Dec 5, 2020, 3:22 PM IST

చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత తేలికైన క్వాంటమ్​ కంప్యూటర్​ను రూపొందించారు. సూపర్​ కంప్యూటర్​లు సైతం వేల సంవత్సరాలు చేసే పనిని ఈ కంప్యూటర్​ సెకండ్స్​లో చేయగలదని తెలిపారు. ఇది 'అతిపెద్ద విజయం 'గా అభివర్ణించారు. కంప్యూటర్​ రంగంలోనే ఇది మైలురాయిగా శాస్త్రవేత్తలు తెలిపారు. క్వాంటమ్​ కంప్యూటర్​కు 'జియూఝాంగ్​'గా నామకరణం చేశారు. క్వాంటమ్​ కంప్యూటర్​ చేసే పని.. సంప్రదాయ కంప్యూటర్లకు సాధ్యం కాదని వివరించారు. మెటీరియల్​ సైన్స్​, కృత్రిమ మేధ, మెడిసిన్​ రంగాల్లో ఈ కంప్యూటర్​ను వినియోగించవచ్చని తెలిపారు.

జియూఝాంగ్​ ఈ పేరు చైనాకు చెందిన గణిత శాస్త్రం లోనిది. 'గాసియన్​ బోసన్'​ అనే సంక్లిష్టమైన లెక్కను చేయటానికి ఈ కంప్యూటర్​కు కేవలం 200 సెకండ్స్ పట్టింది. అదే ఫుగాకు (ప్రపంచంలోనే వేగవంతమైన క్లాసికల్ సూపర్​ కంప్యూటర్​)కు ఈ ప్రశ్న చేయటానికి 6 వందల మిలియన్ సంవత్సరాలు పడుతుంది. గూగుల్ సంస్థ తయారు చేసిన 53-క్యూబిట్​ క్వాంటమ్​ కంప్యూటర్​ తరువాత.. గాసియన్​ బోసన్ ప్రశ్నను సెకండ్స్​లో చేసిన రెండో కంప్యూటర్​గా నిలిచింది.

చైనా ప్రస్తుతం క్వాంటమ్​ కంప్యూటింగ్​పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2017లో చైనా క్వాంటమ్​ సమాచార ఉపగ్రహాన్ని రూపొందించింది. క్వాంటమ్​ కంప్యూటింగ్​ వ్యవస్థ హ్యాకింగ్​కు గురి కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంది చైనా ప్రభుత్వం.

ఇదీ చదవండి :'ఆసియన్స్​ ఆఫ్​ ది ఇయర్'​లో పూనావాలాకు చోటు

ABOUT THE AUTHOR

...view details