చైనాలో కరోనా వైరస్ (China Covid 19 news) పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గాన్సు రాష్ట్రంలోని బౌద్ధ మందిరాలు, ప్రఖ్యాత ప్రార్థనా స్థలాలను మూసేసింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 కొత్త కేసులు (China Corona cases live) వెలుగులోకి వచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఇందులో నాలుగు గాన్సు నుంచే ఉన్నట్లు తెలిపింది. 19 కేసులు (China Covid 19 news) ఇన్నర్ మంగోలియాలో వెలుగుచూసినట్లు పేర్కొంది. దీంతో ఇన్నర్ మంగోలియాలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.