వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. తూర్పు షాండాంగ్ రాష్ట్రం సహా టియాంజిన్, బీజింగ్, జియాన్ ప్రాంతాల్లో పర్యటక , దూర ప్రాంత ప్రయాణ బస్సు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో బస్సులకు అనుమతి లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు విధించింది చైనా. తాజాగా ఎక్కువ జనాభా కలిగిన నాలుగు ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేసే ఇంటర్ సీటీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.