తెలంగాణ

telangana

ETV Bharat / international

'200 కోట్ల డోసులు విరాళంగా అందిస్తాం'

ప్రపంచదేశాలకు 200కోట్ల కరోనా టీకా డోసులను ఉచితంగా అందిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ప్రకటించారు. వీటిని ఈ సంవత్సరమే అందిస్తామని హామీ ఇచ్చారు.

CHINA
CHINA

By

Published : Aug 6, 2021, 5:21 AM IST

కరోనా మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ భరోసా ఇచ్చారు. ఈ ఏడాది 200 కోట్ల డోసుల టీకాలను విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) ఆధ్వర్యంలోని కొవాక్స్ కూటమికి సుమారు రూ.740కోట్లు సమకూరుస్తామని కూడా హామీ ఇచ్చారు.

కొవిడ్-10 టీకా సహకారానికి సంబంధించి గురువారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు జిన్​పింగ్ తన సందేశాన్ని లేఖ రూపంలో పంపించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్‌ల పంపిణీకి చైనా మద్దతునిస్తుందని ప్రకటించారు.

అఫ్గానిస్థాన్ నుంచి జాంబియా వరకు మొత్తం 65 దేశాలకు 110 మిలియన్ కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందజేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపిన తర్వాత షీ జిన్​పింగ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details