తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీకి జిన్​పింగ్​ లేఖ- కరోనా కట్టడికి సాయం! - భారత్​కు చైనా సాయం

కరోనా రెండో దశ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న భారత్​కు సాయం అందిస్తామని తెలిపారు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​. కరోనా ఉద్ధృతిపై సానుభూతి ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Modi, Jinping
మోదీ, జిన్​పింగ్​

By

Published : Apr 30, 2021, 6:24 PM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో సానుభూతి తెలుపుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ లేఖ రాశారు. కరోనా కట్టడిలో మద్దతుగా నిలుస్తామని, దేశంలోని ప్రస్తుత కొవిడ్​-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆ దేశ జిన్హువా న్యూస్​ పేర్కొంది.

" కరోనా నియంత్రణలో భారత్​కు సహకరించేందుకు చైనా సిద్ధంగా ఉంది. మద్దతుగా నిలుస్తాం. భారత్​కు సాయం అందిస్తాం. "

- జిన్​పింగ్​ సందేశం

కరోనా కట్టడిలో భారత్​కు అన్ని విధాలుగా సాయం అందిస్తామని చైనా​ విదేశాంగ మంత్రి వాంగ్​ యీ హామీ ఇస్తూ భారత విదేశాంగ మంత్రి జై శంకర్​కు లేఖ రాశారు. చైనాలో తయారయ్యే కరోనా నియంత్రణ సామగ్రిని భారత్​కు అందిస్తామని తెలిపారు.

తూర్పు లద్దాఖ్​లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడని క్రమంలో చైనా అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి.. భారత్​కు సాయం చేస్తామని ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:భారత్​కు సాయం చేసేందుకు సిద్ధం: ఐరాస

ABOUT THE AUTHOR

...view details