చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఉద్ఘాటించారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. ముఖ్యంగా అమెరికా నిరంకుశ భావజాలంతో దాడులు చేస్తున్నా, విమర్శలు గుప్పిస్తున్నా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. జపాన్‌పై యుద్ధంలో విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం మాట్లాడారు జిన్‌పింగ్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) నుంచి చైనా ప్రజలను వేరు చేసేందుకు ఏ దేశం చేసే ప్రయత్నాలనైనా.. చైనా ప్రజలు, తాము తిప్పికొడతామని స్పష్టం చేశారు.
"జపాన్‌పై యుద్ధంలో గెలిచాక చైనాలో అనేక మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా చైనా దూసుకుపోతోంది. పేదరిక నిర్మూలన, సంపన్న సమాజం నిర్మణమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది" అని జిన్‌పింగ్ చెప్పినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.