చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సిబ్బంది (China PLA Army) పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంచరిస్తున్నారు. సరిహద్దు పోస్టులు, గ్రామాలను సర్వే చేస్తున్నారు. సుమారు 50 మంది పీఎల్ఏ సైన్యం(China PLA Army news).. నెల రోజుల క్రితం పీఓకేలోని కెల్, జురా, లీపా సెక్టార్లలో పర్యటించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్థాన్ సైనిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. భారత సైనిక వర్గాలు ఈ కార్యకలాపాలపై కన్నేసి ఉంచాయని చెప్పాయి.
చైనా సైన్యం (China PLA Army latest news) పర్యటించిన ప్రాంతాల నుంచే పాక్.. తన ఉగ్రవాదులను భారత్లోకి పంపిస్తుంది. పీఎల్ఏ సైన్యం (China PLA Army news)ఈ ప్రాంతానికి వచ్చి ఐదు, ఆరుగురు సభ్యులతో కూడిన బృందాలుగా విడిపోయారని అధికారులు తెలిపారు. గ్రామాల్లో పర్యటించి సర్వేలు చేశారని చెప్పారు. పాకిస్థాన్ ఆర్మీ పోస్టులతో (China Pakistan news) పాటు కశ్మీర్ లోయలోకి చేరుకునేందుకు ఉగ్రవాదులు ఉపయోగించే చొరబాటు మార్గాలనూ వీరు పరిశీలించారని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ అధికారులు, ఆర్మీ సిబ్బంది చైనా సైన్యం (China army in Pakistan) వెంట ఉన్నారని తెలిపారు.
నియంత్రణ రేఖ వెంబడి నమూనా గ్రామాలను నిర్మించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, వారికి చైనా సైన్యం (China army in Pakistan) సహకరిస్తోందని సీనియర్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులతో పాటు సైన్యం కూడా ఉపయోగించుకునేలా ఈ గ్రామాల నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు.