ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాక్సిన్ను 2020 చివరినాటికి చైనా వైద్యులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఆ దేశం. నవంబర్లో చలి కారణంగా వైరస్ విజృంభించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిలోనైనా సేవలు అందించేందుకు వారిని సన్నద్ధం చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ గావో పూ ప్రకటన విడుదల చేశారు.
నాటికి సిద్ధం..
వైరస్ మరోసారి విజృంభించే నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు గావో. మరోసారి వ్యాప్తి మొదలయ్యే నాటికి పలువురు వైద్యులు వ్యాక్సిన్ను తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి మెడిసిన్, వ్యాక్సిన్ను పరిశోధించేందుకు పరిమిత సమయం ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ను పరిశీలించేందుకు చైనా ఇప్పటికే ముగ్గురిని ఎంపిక చేసినట్లు చెప్పారు.
రెండో దశలో వెక్టార్ వ్యాక్సిన్..