Chinese man sold his children: చైనా హెబే రాష్ట్రంలో ఓ వ్యక్తి డబ్బు కోసం సొంత బిడ్డలనే విక్రయించాడు. ఐదుగురు పిల్లలను 28,275డాలర్లకు(రూ.31 లక్షలు) ఇతరులకు అమ్మేశాడు. విచారణ అనంతరం యూ కౌంటీ కోర్టు ఇతనికి 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. పిల్లలను అమ్మేందుకు సహకరించిన మరో ఇద్దరికి కూడా శిక్ష ఖరారు చేసింది.
కోర్టు తెలిపివ వివరాల ప్రకారం ఈ వ్యక్తి పేరు యాంగ్. అతని భార్య పేరు యువాన్. 2012-2020 మధ్య ఈ దంపతులు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులను అమ్మేశారు. ఒక్కొక్క బిడ్డను రూ.2 లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ధరకు విక్రయించారు. నలుగురు పిల్లలను అమ్మేందుకు లీ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. అందుకు అతనికి రూ.35వేలకుపైగా ఇచ్చారు. మరో మగబిడ్డను పుట్టిన వెంటనే ఆస్పత్రిలో పక్క బెడ్లో ఉన్న మహిళకు విక్రయించారు యాంగ్, యువాన్ దంపతులు.
ఈ నేరంలో మధ్యవర్తిగా ఉన్న లీ, అతని కోడలు డువాన్ను కూడా దోషులుగా తేల్చింది న్యాయస్థానం. లీకి ఏడేళ్లు, డువాన్కు 21నెలల జైలు శిక్ష ఖరారు చేసింది.
సొంత తల్లిదండ్రులే తమ బిడ్డల్ని విక్రయించండం అత్యంత హేయమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల్లి ప్రేమతో పెంచి పెద్ద చేయాల్సిన వారే వాళ్లని వ్యాపార సాధనంగా చూశారని మండిపడింది. కేవలం డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే వీరు పిల్లల్లి కన్నారు తప్ప మరో కారణం లేదని తేల్చి చెప్పింది. ఇలా చేయడం మైనర్ల హక్కులను కాలరాయడమే గాక, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లవుతుందని పేర్కొంది.
China news