తెలంగాణ

telangana

ETV Bharat / international

యాప్స్​ నిషేధంపై చైనా స్పందన.. ఏమందంటే? - china apps

చైనా యాప్​లను భారత్​లో నిషేధించడంపై స్పందించింది ఆ దేశ విదేశాంగ శాఖ. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను భారత్ కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Chinese foriegn ministry
యాప్స్ నిషేధంపై డ్రాగన్

By

Published : Jun 30, 2020, 1:47 PM IST

చైనా యాప్​లను భారత్ నిషేధించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అంతర్జాతీయ, స్థానిక చట్టాలను అనుసరించి వ్యాపారాలు నిర్వహించాలని చైనా వ్యాపార సంస్థలకు చెబుతుందని వెల్లడించారు. చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను భారత ప్రభుత్వం సంరక్షించాలని పేర్కొన్నారు.

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్​లను నిషేధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. భారత్​- చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. డ్రాగన్ ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్​ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగానే చైనా యాప్​లపై వేటు వేసింది. భారత్ తీసుకున్న తాజా చర్యతో... చైనా టెక్నాలజీ కంపెనీలకు భారీ నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:'ట్రంప్​ ఫోరమ్'​కు షాక్​- నిషేధించిన రెడ్డిట్

ABOUT THE AUTHOR

...view details