కొవిడ్-19 పోరులో భారత్‌కు అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. కరోనా కట్టడికి చైనాలో తయారయ్యే వస్తువులు వేగంగా భారత్‌కు చేరుస్తామన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు వాంగ్.
" కరోనాతో భారత్ ఎదుర్కుంటున్న సవాళ్లకు చైనా సానుభూతి తెలుపుతోంది. మానవాళికి కరోనా వైరస్ ఉమ్మడి శత్రువు. అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాల్సిన సమయం. వేగంగా స్పందించేందుకు సహకారం అవసరం. కరోనాతో పోరాడుతున్న భారత ప్రభుత్వం, ప్రజలకు చైనా మద్దతుగా ఉంటుంది. భారత ప్రభుత్వం నేతృత్వంలో ప్రజలు త్వరలోనే మహమ్మారిపై విజయం సాధిస్తారనే నమ్మకం ఉంది. "