భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక ప్రతినిధుల సమావేశం నేడు దిల్లీలో జరగనుంది. ఈ 22వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ చర్చలు జరపనున్నారు.
ఈ ఏడాది అక్టోబర్లో మామల్లపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) నుంచి భారత్ వైదొలిగింది. వీటి తరువాత భారత్- చైనా మధ్య జరుగుతున్న మొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. మోదీ-జిన్పింగ్ మధ్య జరిగిన రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలును ఇవాళ ఇరుపక్షాలు సమీక్షించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'భారత్-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'
అప్పుడు వాయిదా