తాము అభివృద్ధి చేసిన కరోనావ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ ఆదివారం ప్రకటించింది. తొలుత మనుషులపై ప్రయోగించిన వ్యాక్సిన్ ద్వారా అది సురక్షితమైందని నిర్ధరణ అయిందని.. బీజింగ్‌లో తయారు చేసిన రెండో వ్యాక్సిన్ క్యాండిడేట్ ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చిందని పేర్కొంది. ఈ టీకాను తొలిదశ 1/2 క్లినికల్ ట్రయల్స్‌లో 1,120 మందికి ఇచ్చారు. వీరందరిలో యాంటీబాడీస్‌ను ఆ టీకా తయారు చేసిందని పేర్కొంది.
మనుషులకు ఇచ్చేందుకు అనుమతి
ఈ విషయాన్ని సీఎన్‌బీజీ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ వీచాట్‌లో పోస్టు చేసింది. దీనికి అదనపు సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు వుహాన్‌లో ఇదే సంస్థకు చెందిన మరోశాఖలో అభివృద్ధి చేసిన ఇంకో టీకా కూడా మనుషుల్లో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి జరిగేట్లు చేస్తోందని పేర్కొంది. ఇప్పటికే చైనా అభివృద్ధి చేసిన పలు టీకాలను మానవులపై ప్రయోగించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక మూడో దశ ప్రయోగాల కోసం భారీ సంఖ్యలో వలంటీర్లను నియమించుకుంటోంది.
దీంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా ఈ టీకా మూడో దశ ప్రయోగాలు నిర్వహించనుంది. కానీ, కచ్చితంగా ఈ టీకా క్యాండిడేట్‌ను ప్రయోగిస్తోందో మాత్రం వెల్లడించలేదు.
ఇదీ చూడండి:ఘర్షణకు ముందే మార్షల్ యోధులను పంపిన చైనా!