కరోనా మహమ్మారి కారణంగా చైనాలో ఓ వైద్యుడు మృతి చెందినట్లు ఆ దేశ స్థానిక మీడియా తెలిపింది. నాలుగు నెలల పాటు చికిత్స పొందిన తర్వాత అతడు మరణించినట్లు వెల్లడించింది. గత కొన్ని వారాల్లో ప్రాణాంతక వైరస్‌తో చనిపోయిన వ్యక్తి ఇతడేనని పేర్కొంది.
కానీ ఆ దేశ ఆరోగ్య వర్గాలు మాత్రం గత 24 గంటల్లో ఒకరు కూడా కరోనాతో మరణించలేదని ప్రకటించింది. అయితే కరోనాతో చనిపోయిన వ్యక్తి పేరు హు వైఫెంగ్గా తెలిపిన ఆ దేశ మీడియా.. కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్‌లో డాక్టర్‌గా విధులు నిర్వహించేవారని పేర్కొంది.