తెలంగాణ

telangana

ETV Bharat / international

28గంటల్లో 10అంతస్తుల భవంతి నిర్మాణం! - మాడ్యూల్స్​తో భవన నిర్మాణం

చైనాకు చెందిన ఓ భవన నిర్మాణ సంస్థ కేవలం 28 గంటల్లో 10 అంతస్తుల భవనాన్ని చకచక కట్టేసి అందర్ని అబ్బుర పరిచింది. ఇందుకు సంబంధించిన 5 నిమిషాల నిడివిగల వీడియోను తన యూట్యూబ్​ ఛానెల్​లో ఈ నెల 13న పెట్టింది.

10-storey building in  just over 28 hours
10 అంతస్తుల భవంతి

By

Published : Jun 19, 2021, 2:52 PM IST

చైనాలోని చాంగ్షా నగరంలో 10అంతస్తుల భవనాన్ని కేవలం 28 గంటల 45 నిమిషాల్లో కట్టి ఔరా అనిపించింది ఆ దేశానికి చెందిన ప్రముఖ భవన నిర్మాణ సంస్థ బ్రాడ్​ గ్రూప్​. ఈ నెల 13న ఆ సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో దాదాపు ఐదు నిమిషాల నిడివి గల భవన నిర్మాణ వీడియోను షేర్​ చేసింది. నిర్మాణాన్ని మొదలు పెట్టిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు వారు చేసిన పనులను తెలిపేలా ఈ వీడియోను రూపొందించింది.

అతి తక్కువ సమయంలో భవంతి నిర్మాణం చేయాలని అనుకున్నాము. దీని కోసం గతంలో నిర్మించిన వాటి తాలూకూ విధానాలను చూశాము. ఇందుకు తగినట్లుగా ప్రణాళిక రచించుకున్నాం. నిర్మాణానికి అవసరం అయ్యే కార్మిక శక్తిని ముందే సిద్ధం చేసుకున్నాం. నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఓ భవంతి నిర్మాణం చేపట్టడానికి సాధారణంగా వారాలు, రోజులు పడుతుంది. కానీ మా ప్రణాళికతో అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించాం.

- బ్రాడ్​ గ్రూప్​, భవన నిర్మాణ సంస్థ

ముందుగా నిర్మించిన వాటితో...

ఈ భవంతి నిర్మాణానికి కావాల్సిన స్లాబులను, మాడ్యూల్స్​ను సంస్థ ముందుగానే నిర్మించి పెట్టుకుంది. భారీ క్రేన్ల సాయంతో నిర్మాణ స్థలానికి తరలించింది. ఆపై వాటిని అనుకున్న విధంగా కార్మికులు వాటిని అమర్చారు. అనంతరం వాటిని ఒకదానితో ఒకటి కలిపారు. ఆపై బోల్టుల సాయంతో గట్టింగా కదలకుండా ఉండేలా చేశారు. దీంతో అతి తక్కువ సమయంలోనే 10 అంతస్తుల భవనం రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి సంస్థ మూడు క్రేన్లు ఉపయోగించింది.

సకల సదుపాయాలు...

10 అంతస్తులను నిర్మించడం మాత్రమే కాకుండా ప్రతీ అంతస్తుకి విద్యుత్​, నీటి సౌకర్యాన్ని కల్పించింది. 'రెడీ టూ ఆక్యూపై' అనే విధంగా సిద్ధం చేసింది. మరోక ప్రత్యేకత ఏమంటే ఈ భవంతి భూకంపం వచ్చిన తొనకదని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.

ఇదీ చూడండి:Joe Biden: డ్రాగన్‌ దూకుడుకు అమెరికా ముకుతాడు

ABOUT THE AUTHOR

...view details