తెలంగాణ

telangana

ETV Bharat / international

China Vaccine: చైనా టీకాతో రక్షణ తక్కువే..! - Sinopharm age limit

చైనా టీకాల పనితీరు మరోసారి చర్చనీయాంశమయ్యింది. చైనా సినోఫార్మ్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వృద్ధులకు రక్షణ కల్పించడం లేదని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. టీకా తీసుకున్న పెద్దవారిలో వయసు పెరిగే కొద్దీ యాంటీబాడీల స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

china Sinopharm vaccine
చైనా సినోఫార్మ్‌

By

Published : Jul 24, 2021, 4:36 AM IST

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 179 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో చైనా టీకాలు పంపిణీ చేస్తోన్న పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో చైనా వ్యాక్సిన్‌ల సమర్థతపై ఆయా దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సినోఫార్మ్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఎక్కువ వయసున్న (50ఏళ్ల వయసుపైబడిన) వారికి కరోనా నుంచి రక్షణ కల్పించడంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నట్లు హంగేరీలో జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో చైనా టీకాల పనితీరు మరోసారి చర్చనీయాంశమయ్యింది.

తక్కువ యాంటీబాడీలు..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను చైనా ఇప్పటివరకు మూడింటిని అభివృద్ధి చేసింది. ఇందులో సినోఫార్మ్‌ రూపొందించిన టీకా పనితీరును విశ్లేషించేందుకు హంగేరీలో ఓ అధ్యయనం చేపట్టారు. దాదాపు 450మందిలో అధ్యయనం జరపగా.. వీరిలో 50ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్న వారిలోనే 90శాతం యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. కానీ, వయసు పెరిగే కొద్దీ (టీకా తీసుకున్న పెద్దవారిలో) యాంటీబాడీల స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా 60ఏళ్ల వయసున్న 25శాతం మందిలో యాంటీబాటీల ప్రతిస్పందనలు లేకపోగా.. 80ఏళ్లకు పైబడిన 50శాతం మందిలో వ్యాక్సిన్‌ రక్షణ కల్పించడం లేదనే అంచనాకు వచ్చారు. దీనివల్ల ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న ఎక్కువ మంది వృద్ధులు కరోనా వైరస్‌ బారినపడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనా నేషనల్‌ ఫార్మా గ్రూప్‌ (Sinopharm) తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను చైనాలో విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేతృత్వంలో ఏర్పాటైన 'కొవాక్స్‌' కార్యక్రమానికి దాదాపు 17కోట్ల డోసులను (వచ్చే ఏడాది నాటికి) అందించేందుకు సినోఫార్మ్‌ ఒప్పందం చేసుకుంది. అయితే, సినోఫార్మ్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ సమర్థత పరిమితంగానే ఉందని తాజా అధ్యయనంతో పాటు గతంలో జరిపిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా డెల్టా వంటి కొత్త వేరియంట్‌లను ఎదుర్కోవడంలోనూ తక్కువ యాంటీబాడీ ప్రతిస్పందనలు చూపించినట్లు వెల్లడించాయి. దీంతో చైనా టీకాపై ఆధారపడిన దేశాలు వాటి పనితీరుపై ఆందోళన చెందుతున్నాయి.

ఇవీ చదవండి:Corona Virus: రష్యాలో కొత్తగా గామా వేరియంట్ కేసులు

డెల్టా రకంతో పెరుగుతోన్న రీఇన్​ఫెక్షన్​ ముప్పు!

ABOUT THE AUTHOR

...view details