తెలంగాణ

telangana

ETV Bharat / international

'సింగిల్స్​ డే' సేల్స్​లో మరోసారి ఆలీబాబా రికార్డు - 'సింగిల్స్​ డే' సేల్స్​లో మరోసారి ఆలీబాబా రికార్డు

'సింగిల్స్​ డే' సందర్భంగా చైనా ఆన్​లైన్​ వ్యాపార దిగ్గజం ఆలీబాబా సంస్థ నిర్వహించిన షాపింగ్ బొనాంజాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కరోనా నుంచి కోలుకుంటుండటంతో.. చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వినియోగం పుంజుకుంటోంది.

Chinese consumers spend over $100b in shopping fest  singles day
'సింగిల్స్​ డే' సేల్స్​లో మరోసారి ఆలీబాబా రికార్డు

By

Published : Nov 12, 2020, 5:50 AM IST

'సింగిల్స్​ డే'లో భాగంగా నవంబరు 1నుంచి 11వరకు ఆలీబాబా సంస్థ నిర్వహించిన షాపింగ్​ బొనాంజాలో 498 బిలియన్​ యువాన్లకు పైగా అమ్మకాలు నమోదు చేసి రికార్డు సృష్టించింది. నవంబరు 11న ఒక్కరోజే గత సంవత్సర రికార్డు 38.4బిలియన్​ డాలర్లను దాటివేసింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారులకు ఊరట కలిగిస్తూ ఈసారి సేల్స్​ తేదీల గడువును పెంచింది ఆలీబాబా సంస్థ.

మరో రిటైల్ వ్యాపార సంస్థ జేడీ.కమ్​ నిర్వహించిన షాపింగ్​ బొనాంజాలో 271.5బిలియన్​ యువాన్ల అమ్మకాలు నమోదయ్యాయి. సింగిల్స్​ డే షాపింగ్​ ఉత్సవాన్ని చైనాలో ఏటా నిర్వహిస్తారు. ఇందులో ప్రతి వస్తువూ తక్కువ ధరకే లభ్యమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details