తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2020, 4:01 PM IST

ETV Bharat / international

ఏడాది చివరి నాటికి చైనా వ్యాక్సిన్​

చైనాలోని సినోఫార్మా సంస్థ.. ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. సంస్థ వద్ద ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు ట్రయల్స్​ దశలో ఉన్నాయి.

Chinese company: Vaccine ready by end of year
ఏడాది చివరి నాటికి చైనా వ్యాక్సిన్​

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చైనా ప్రభుత్వ అనుబంధ ఫార్మా సంస్థ సినోఫార్మా తెలిపింది. ఈ వ్యాక్సిన్(రెండు డోసులు)​ 140యువాన్ల(రూ. 10,782) కన్నా తక్కువ ఉంటుందని సంస్థ ఛైర్మన్​ లియూ జింగ్​జెన్​ పేర్కొన్నారు.

దేశంలోని 1.4 బిలియన్​ మంది ప్రజలు వ్యాక్సిన్​ తీసుకోవాల్సిన అవసరం లేదని.. పెద్ద పెద్ద నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగులకు టీకా అందించాలని వెల్లడించారు జింగ్​జెన్​.

సినోఫార్మా వద్ద ప్రస్తుతం రెండు వ్యాక్సిన్​లు ట్రయల్స్​ దశలో ఉన్నాయి. ఏడాదికి 220 మిలియన్​ డోసులను తయారీ చేసే సామర్థ్యం ఈ సంస్థ సొంతం. తాను ఇప్పటికే ఈ వ్యాక్సిన్​ను తీసుకున్నట్టు జింగ్​జెన్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:-'ఆ దేశ ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్'

ABOUT THE AUTHOR

...view details