తెలంగాణ

telangana

ETV Bharat / international

2021కల్లా చైనా 'కరోనా వ్యాక్సిన్'​! - సినోవాక్​

వచ్చే ఏడాది ఆరంభం నాటికి కరోనాకు వ్యాక్సిన్​ను సిద్ధం చేయనున్నట్టు చైనా ఫార్మా సంస్థ సినోవాక్​ వెల్లడించింది. అమెరికా, ఐరాస సహా ప్రపంచవ్యాప్తంగా ఈ టీకాను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు స్పష్టం చేసింది.

Chinese company says coronavirus vaccine ready by early 2021
2021 తొలినాళ్లల్లో చైనా కరోనా వ్యాక్సిన్​!

By

Published : Sep 25, 2020, 5:18 AM IST

ప్రపంచవ్యాప్తంగా.. కరోనా వ్యాక్సిన్​పై ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నాయి. తాజాగా.. తాము అభివృద్ధి చేస్తున్న టీకాను.. 2021 ఆరంభంకల్లా ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా ఫార్మా సంస్థ సినోవాక్​ వెల్లడించింది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ 'కరోనావాక్​' టీకాను అందుబాటులో ఉంచనున్నట్టు స్పష్టం చేసింది.

టీకా సురక్షితమైనదేనని తేలిన అనంతరం.. అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​కు దరఖాస్తు చేయనున్నట్టు సినోవాక్​ సంస్థ సీఈఓ యిన్​ వైడాంగ్​ వెల్లడించారు.

"తొలుత కేవలం చైనాకు మాత్రమే వ్యాక్సిన్​​ను సరఫరా చేయాలనుకున్నాం. అందుకు తగ్గట్టు ప్రణాళికలు చేసుకున్నాం. అయితే ఆ తర్వాత వాటిని మార్చుకున్నాం. అమెరికా, ఐరాస సహా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్​ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం."

-- యిన్​ వైడాంగ్​, సినోవాక్​ సీఈఓ.

చైనా అభివృద్ధి చేస్తున్న నాలుగు కరోనా టీకాల్లో కరోనావాక్​ ఒకటి. ప్రస్తుతం.. బ్రెజిల్​, టర్కీ, ఇండోనేషియాలో 24వేలమందిపై టీకాకు సంబంధించిన క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

ఇదీ చూడండి:-కరోనా టీకా​ 'హ్యూమన్ ఛాలెంజ్​'కు బ్రిటన్​ రెడీ

ABOUT THE AUTHOR

...view details