తెలంగాణ

telangana

ETV Bharat / international

హాలిడే సీజన్​లో 5కోట్ల మందికి టీకా! - చైనా టీకా

చైనాలో త్వరలో ప్రారంభం కానున్న హాలీడే సీజన్​లో 5 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాను చైనా గురువారం అత్యవసర వినియోగానికి ఆమోదించింది.

Chinese city in isolation as virus cases increase
హాలిడే సీజన్​లో 5కోట్ల మందికి టీకా!

By

Published : Jan 5, 2021, 10:43 PM IST

హాలిడే సీజన్​లో భాగంగా 9 ముఖ్యమైన వర్గాలకు చెందిన 5కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 73,537 మందికి టీకా అందించారు అధికారులు. దేశ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్​ను అందిస్తామని చైనా ప్రభుత్వం ఇదివరకే తెలిపింది.

'ఇంట్లోనే హాలిడే సీజన్'​

చైనా షెన్​యాంగ్​ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్​ పరీక్షలను ముమ్మరం చేశారు అధికారులు. పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినవారిని ఐసోలేషన్​కు తరలిస్తున్నారు. వలస కార్మికులు, ప్రజలు హాలిడే సీజన్​లో ఇంట్లోనే ఉండాలన్నారు. పర్యటకులు బీజింగ్​కు రావొద్దని సూచించారు.

చైనాలో ఇప్పట వరకు 82,183 కరోనా కేసులు నమోదయ్యాయి. 4,634 మంది వైరస్ బారినపడి మరణించారు.

ఇదీ చదవండి :'అందరికీ టీకా' కావాలంటే ఒకే డోసు తీసుకోవాలా?

ABOUT THE AUTHOR

...view details