ఆరు నెలల మిషన్‌లో భాగంగా చైనా వ్యోమగాములు(China space station) అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. తియాన్హే వ్యోమనోక(China Astronaut) ద్వారా 55 ఏళ్ల ఝాయ్ ఝాయ్‌గాంగ్, మహిళా వ్యోమగామి 41ఏళ్ల వాంగ్ యాపింగ్, 41 ఏళ్ల యెగువాంగ్‌పు నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఈ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకుగాను 6 నెలలు అక్కడే ఉంటారు. ఇది చైనా అంతరిక్షచరిత్రలోనే సుదీర్ఘ మిషన్‌గా నిలవనుంది. చైనా అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన చైనా తొలి మహిళా వ్యోమగామిగా వాంగ్(China Astronaut) నిలిచారు.
చైనా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని ఈ తెల్లవారుజామున చేపట్టగా బీజింగ్ కాలమానం ప్రకారం వ్యోమనౌక 6.56 నిమిషాలకు అంతరిక్ష కేంద్రానికి చేరింది.
గోబీ ఏడారిలో ఉన్న జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌ను(China Astronaut) అంతరిక్షంలోకి పంపింది. తియాన్‌జౌ-2 తియాన్‌జౌ-3 కార్గో క్రాప్ట్‌లతో ఓ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావటానికి దాదాపు 7 గంటల సమయం పట్టినట్లు చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది.
టియాంగాంగ్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే చిన్న నోటీసు ద్వారా మరో అంతరిక్ష నౌకను పంపేందుకు చైనా అంతరిక్ష సంస్థ సిద్ధంగా ఉన్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ఓ కథనంలో పేర్కొంది. వ్యోమగాములు 6 నెలల కాలంలో వందలాది ఏరోస్పేస్ ఔషధాలు, భౌతిక ప్రయోగాలతోపాటు రెండు నుంచి మూడు స్పేస్ వాక్‌లు చేయనున్నారు. భవిష్యత్ నిర్మాణ పనులు చేసేందుకు వీలుగా నూతన రోబోటిక్ ఆర్మ్స్ ఏర్పాటు చేయనున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.