వాతావరణ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తలపెట్టిన ప్రపంచనేతల సదస్సు(ఏప్రిల్22-23)కు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరుకానున్నారు. ఈమేరకు చైనా అధికారికంగా వెల్లడించింది.
2005 నుంచి 2030లోగా.. చైనాలో కర్బన ఉద్గారాలను 65 శాతం తగ్గిస్తామని డిసెంబర్లో జిన్పింగ్ స్పష్టం చేశారు. అయితే.. ఈ శాతాన్ని మరింత తగ్గించే విషయం గురించి చైనా అధినేత మార్పులేమైనా చేస్తారా అన్నసంకేతాలు ప్రస్తుత ప్రకటనలో లేదు.
వాతారవరణ మార్పుల కట్టడిలో పరస్పర సహకారం సహా.. ఇతర దేశాలకు తోడ్పాటునందించేందుకు అమెరికా, చైనా అంగీకరించాయి. ఆ దిశగా తక్షణ కార్యాచరణ అమలుకు యూఎస్ ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ, చైనా ప్రతినిధి జీ జెన్హువాలు.. షాంఘైలో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాతావరణ సంక్షోభంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తలపెట్టిన ప్రపంచ నేతల సదస్సుకు కొద్ది రోజుల ముందే ఈ ప్రకటన వెలువడింది.